Followers

ప్రతి ఒక్కరూ కరోనా టీకాను సద్వినియోగం చేసుకోవాలి

 ప్రతి ఒక్కరూ కరోనా టీకాను సద్వినియోగం చేసుకోవాలి

- తొర్రూరు తహసీల్దార్ రాఘవరెడ్డి

తొర్రూరు, పెన్ పవర్

గ్రామీణ ప్రాంత ప్రజలు కరోనా టీకాను సద్వినియోగం చేసుకోవాలని, మహబూబాద్ జిల్లా తొర్రూరు తహసీల్దార్ రాఘవరెడ్డి కోరారు.శుక్రవారం మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి, కరోనా వైరస్ సోకకుండా  వ్యాక్సినేషన్ వేసుకోవాలని, అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కోవిడ్‌ మహమ్మారి నుంచి 100 శాతం రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని, తెలిపారు.అసత్య ప్రచారాలను విశ్వసించకుండా ప్రతిఒక్కరూ టీకా పొందాలని, సూచించారు.రెండో విడతలో 45-59 ఏళ్ల మధ్య వయసు గల వారు,60ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారన్నారు.ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతం కావడంతో 45ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇవ్వాలని,రాస్తే ప్రభుత్వం భావించిందన్నారు.టీకాలు అందరూ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తప్పనిసరిగా టీకా వేసుకుంటే ఆరోగ్యానికి ముప్పు ఉండదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం విధిగా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలన్నారు.45 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా టీకా రెండు డోసులు తీసుకోవాలన్నారు. దీంతో మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను రక్షించిన వారమవుతామని, తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ అంకుష్, పంచాయతీ కార్యదర్శి నాగార్జున, ఆశా వర్కర్ లలిత, వీఆర్ఏ సందీప్, కారోబార్ రాజు, రామ్మూర్తి ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...