ఎఫ్.సి.ఐ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన అన్నదాతలు..
అదానీ, అంబానీల నుండి భారత ఆహార సంస్థను కాపాడండి..రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా..
పెన్ పవర్ తాడేపల్లిగూడెం
రైతుల పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి. అంబానీ,అదానీల నుండి భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)ని కాపాడాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాపిత పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెంలోని ఎఫ్.సి.ఐ జిల్లా కార్యాలయాన్ని సోమవారం అన్నదాతలు ముట్టడించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేంద్ర సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టారు ఎఫ్ సి ఐ కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రైతులు ఆందోళనతో ఎఫ్ సి ఐ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు ఎఫ్ సి ఐ కార్యాలయం వద్దకు అన్నదాతలు వెళ్లకుండా పోలీసులు బారీ గేడ్లు అడ్డుగా పెట్టడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అప్ ల్యాండ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ సిఐటియూ అప్ ల్యాండ్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, డెల్టా కార్యదర్శి పి.వి.ప్రతాప్,బి.కె.ఎం.యూ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డెల్టా ఉపాధ్యక్షులు బళ్ల చినవీరభద్రం,అప్ ల్యాండ్ జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, కాంగ్రెస్ జిల్లా నాయకులు మారినీడి బాబ్జి కౌలు రైతుల సంఘం జిల్లా కోకన్వీనర్ కొర్ని అప్పారావు తదితరులు మాట్లాడారు 1964లో ఏర్పడిన ఎఫ్ సి ఐ రైతులకు దేశ ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు రైతుల నుండి పంటలను సేకరించడం దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజలకు చౌకధరలకు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్న ఎఫ్ సి ఐ ని కేంద్ర సాగు చట్టాల పేరుతో నిర్వీర్యం చేయడం దారుణం అని విమర్శించారు 412 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలు నిల్వ చేయగలిగిన గోదాములను లక్షల కోట్లు విలువ గలిగిన ఎఫ్ సి ఐ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం దారుణమని విమర్శించారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు సాగు చట్టాలలో ఆహార భద్రత చట్టం ఒకటని, ఈ చట్టం అమలులోకి వస్తే ప్రజల ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ కంపెనీలు రైతుల నుండి కారుచౌకగా పంటల కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకుని ఎప్పుడైనా అమ్ముకునే వీలు కల్పించడం వలన నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు లాభాలు కట్టబెట్టేందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించకుండా శాంతకుమార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారని చెప్పారు శాంతకుమార్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల నుండి ఆహార ధాన్యాల సేకరణ నిలిపివేసి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెడతారని చెప్పారు ఎఫ్ సి ఐ ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వం చర్యలు వెంటనే విడుదల చేయాలని రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు రైతుల పంటలకు మద్దతు ధరలు అమలు జరిగేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు అన్నదాతల పోరాటానికి అందరూ అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి, గన్నాబత్తుల నాగేశ్వరరావు, పి.గోవింద్, సత్తి కోదండరామిరెడ్డి, మడక రాజు,కరెడ్ల రామకృష్ణ, బాల బొమ్మల శ్రీనివాస్, టి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి సూర్యనారాయణ, కొండపల్లి గణేశ్వరరావు, కంకటాల బుద్ధుడు, వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, రౌతు ఎల్లమ్మ, రామనాథం మురళీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment