గిరిజనులు పండించే పసుపు ని జిసిసి ద్వారా కొనుగోలు చేయాలి
వారపు సంతల్లో గిరిజనులను దోచుకుంటున్న ధళారీలు
ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఏజెన్సీ ఆర్గానిక్ పసుపుకు విదేశీ మార్కెట్లో గిరాకి
విశాఖ ఏజెన్సీలో ఆదివాసి గిరిజనులు పండించే పసుపును గిరిజన సహకార సంస్థ ద్వారా( జి సి సి) కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ డిమాండ్ చేస్తుంది. గిరిజనులు ఆరు కాలాలు శ్రమించి పండించిన పసుపును మైళ్ల దూరం వారపు సంతల్లోకి తెచ్చిన పసుపు ని దళారీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని గిరిజన సంఘం ఆరోపిస్తోంది.ఐదవ షెడ్యూల్ సాదన కమిటీ ప్రతి నిధులు కె. గోవిందరావు కొర్రా మహేష్ పొట్టి దొరల ఆధ్వర్యంలో గిరిజన సంఘం పసుపు పండించే నేరళ్లు బంధ తదితర గిరిజన గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఐదవ షెడ్యూల్ సాధన సమితి. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరావు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ లో పండించే పసుపు శ్రేష్టమైనదని నూనె శాతం అధికంగా ఉండటం వల్ల ఇక్కడ పసుపుకు విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. గిరిజనుల కష్టపడి పండించిన పసుపును మైళ్ల దూరం మూసుకొని వారపు సంత లకు తెస్తున్నారని అక్కడ దళారులు వ్యాపారులు నచ్చిన ధరకు కొనుగోలు చేసి గిరిజనుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఏజెన్సీలోని 11 మండలాలు నాన్ షెడ్యూల్ గిరిజన 362 గ్రామాలలో 24 వేల ఎకరాల్లో గిరిజనులు పసుపును పండిస్తున్నారు.
మొత్తం 18 వేల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుంది. ఈ పసుపు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ గిరిజనులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వారపు సంతల్లో పసుపు రాసి కిలో 70 రూపాయలు దాటడం లేదని అన్నారు. గిరిజనులు పండిస్తున్న నాణ్యమైన పసుపును జి సి సి మరియు రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. గిరిజనులనుల పసుపు పంట పై ప్రోత్సహించాలని నాణ్యమైన పసుపు విత్తనాలు అందజేయాలని అన్నారు. గిరిజనుల్లో పసుపు శుద్ధి చేసేందుకు బాయిలర్ ఆధునిక యంత్రాలు సమకూర్చాలని కోరుతున్నారు. గిరిజనులు పండించే పసుపు క్వింటాలుకు 15 వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ లో పండే ఆర్గానిక్ పసుపును వారపు సంతల్లో నర్సీపట్నం మాడుగుల వ్యాపారులు కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారని మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా వారపు సంతల్లో మాత్రం వారు నిర్ణయించిన ధరకే పసుపు ను కొనుగోలు చేస్తున్నారని అందువల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. కరోనా కారణంగా గిరిజనులకు నష్టం కలగకుండా పసుపును జి సి సి ద్వారా కిలో 150 రూపాయలకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని గోవిందరావు గిరిజన సంఘం ప్రతినిధులు మోకాళ్ళపై నిల్చొని నినాదాలు చేశారు.
No comments:
Post a Comment