Followers

చింతపల్లి జీకే వీధి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిఐడి అధికారులు తనిఖీలు

చింతపల్లి జీకే వీధి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిఐడి అధికారులు తనిఖీలు

పెన్ పవర్, విశాఖపట్నం

 ఏజెన్సీలోని చింతపల్లి జీకే వీధి మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుక్రవారం సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో బయో మెడికల్ పరికరాలు పనితీరును పరిశీలించారు.  ఆరోగ్య పరికరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేవా అని విచారణ చేపట్టారు. సిఐడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జెర్రిపోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిల్లో  రికార్డులను పరిశీలించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ  ఆస్పత్రుల్లో  కొనుగోలు చేసిన బయోమెడికల్ పరికరాలు  పనిచేస్తున్నాయా లేదా వృధాగా పడి ఉన్నాయా  పరికరాలు  మరమ్మతులకు గురై తే పి బి ఎస్  సంస్థ పరికరాల సర్వీసింగ్ నిర్వహిస్తోందా  లేదా  కొనుగోలు వ్యయం  ఇతరత్రా వివరాలు  వైద్యుల నుండి సేకరిస్తున్నారు. రికార్డులను కూడా పరిశీలించి వివరాలు  సేకరిస్తున్నారు.  ఇప్పటికే జిల్లాలో  అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి  నర్సీపట్నం యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రులను సి ఐ డి తనిఖీలు చేసింది. చింతపల్లి జీకే వీధి మండలాల్లో  ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీలు చేసిన అనంతరం ఏజెన్సీలో పలు మండలాల్లో గల ప్రభుత్వ ఆస్పత్రులను సి ఐ డి  సోదాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...