ప్రైవేటీకరణ ఆపకపోతే మోడీ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణను వెంటనే అపకపోతే మోదీ ప్రభుత్వానికి శాస్తి తప్పదని ఎఐటియుస్ జిల్లా అధ్యక్షులు పడాల రమణ హెచ్చరించారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకమిటీ ఆధ్వర్యంలో జివియంసి గాంధీ విగ్రహంవద్ద నేడు 21వ రోజు దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ దీక్షల్లో సిఎన్టియుఐ యూనియన్కు చెందిన మత్స్యకార్మికులు, ఇంటిపనివారు, స్టీలైంట్, పోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిఎఫ్ఎయుఐ స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గత 3నెలలు గా విశాఖలోను, రాష్ట్రవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వీడకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజల సంపద అయిన ప్రభుత్వరంగ సంస్థలను మోడీ మిత్రులైన కార్పొరేట్లకు కట్టబెట్టేచర్యలు విడనాడకపోతే మోడీ ప్రభుత్వానికి శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ నెల 2 నుండి నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరంలో అనేక తరగతులకు సంబంధించిన ప్రజలు పాల్గొంటు . ఉద్యమం రోజురోజుకు ఉదృతం అవుతున్నదన్నారు.
స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సభ అధ్యక్షులు దాసరి సురేష్, పరిరక్షణ కమిటీ ఛైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో కూడా ఉద్యోగులు,కార్మికులు,మహిళలు నిరాహార దీక్షల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కితీసుకునేవరకు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను చంపేయాలని మోడీ ప్రభుత్వం పూనుకుంటే దేశంలోని కోవిడ్ భాదితులకు ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరా చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ప్రాణదాత విశాఖ స్టీల్ ప్లాంట్ అని కొనియాడారు. స్టీల్ ప్లాంటును కబలించేవారిని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కె.లక్ష్మి, వెంకటలక్ష్మి దివ్య, సిఐటియు నాయకులు దౌలపిల్లి అప్పలరాజు, ఐద్వా నగర కార్యదర్శి జి..ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment