ఈ ఉగాది మీ జీవితాల్లో సుఖసంతోషాలు కలిగించాలి
పాత్రి కేయులు సమాజానికి రెండు కళ్ళు
విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
విశాఖపట్నం, పెన్ పవర్
నూతన తెలుగు సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నగర మేయర్ గొలగాని హరి మెకట కుమారి అన్నారు.స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ పౌర గ్రంధాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నందర్భంగా అసోసియేషన్ ఆడియో విజువలను ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. తరువాత సభ్యులనుద్దేశించి మేయర్ మాట్లాడుతూ విలేకరుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు ఆశోక కుమార్ అండ్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వానికి , ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తూ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు వృత్తి ఎంతో గౌరవమైనదన్నారు. అసోసియేషన్ సభ్యులందరూ జీవీఎంసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జర్నలిస్టులు సమాజానికి కళ్ళు లాంటి వారని కొనియాడారు. లోకంలో జరుగుతున్న ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేసే అత్యుత్తమ స్థాయిలో పాత్రికేయుల పనితీరు వర్ణనాతీతం అని తెలిపారు. ఎండా, వాన, రాత్రి, పగలు ఎటువంటి సమయంలో నైన తమ విధులు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి పాత్రికేయులు మూలకారణం అవుతున్నారని తెలిపారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ గ్రేటర్ విశాఖపరిధిలో సభ్యుల నమోదు కార్యక్రమం చరుకుగా సాగిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది భీమిలి,పెందుర్తి ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యుల సంఖ్య పెంచడంజరిగిందన్నారు. రాబోవు రోజుల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న జర్నలిస్టులకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అందించడమే ధ్యేయంగా సభ్యల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. అసోసియేషన్‌కు సొంత భవనం నిర్మించడమే ప్రధాన ధ్యేయమన్నారు. సభ్యుల సంక్షేమం కోసమే అసోసియేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, అన్నిరాజకీయ పార్టీలు, అధికారులు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తమను ముందుకు నడిపిస్తున్నారన్నారు. జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో తమ అసోసియేషన్ ముందుంటుందని పునరుద్ఘాటించారు. ఎటుంటి భేషజాలకు పోకుండా అంతా ఒకటే అన్న భావనతోనే ముందుకు నడుస్తున్నామని, ఈ ఉగాది అందరికి మంచిని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, అసోసియేషన్ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా ఎస్సిఆర్డబ్ల్యూఏ రిపోర్టర్స్ కు సంక్షేమం అందిస్తూ అందరి ప్రశంసలు సొంతం చేసుకోవడం అద్వితీయమని అన్నారు. అంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి కార్యక్రమాలను నిర్వహించుకోవడం సాధారణ విషయం కాదన్నారు .తోటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్అసోసియేషన్ ఎంతో పాటు పడుతోందని తెలిపారు. ఈ నందర్భంగా ఉగాది వంచాంగం పుస్తకాన్ని మేయర్ ఆవిష్కరించి, సభ్యులకు ఉగాది వంచాగంతో పాటు స్వీట్లు అందజేశారు. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దంవతులను అసోసియేషన్ కార్యవర్గం మనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వద్మణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ (సత్య కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు కాగా సూర్యప్రకాష్ (కిరణ్), రష్, వెంకు సూరి అప్పారావు (శ్రీనివాసరావు, రామకృష్ణ, సహాయక కార్యదర్శులు వద్మజ, సునీల్, గౌరవ సలహాదారులుఎస్వీబి కుమార్, కార్యవర్గ సభ్యులు ఎల్లాబీ, సాగర్, శరత్, మదన్, రాజుతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక కుమార్,కార్యదర్శి నక్కాన ఆలయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సత్య, గౌరవ సలహాదారు ఎస్ఎస్ఆర్ ను సభ్యులు మనంగా సన్మానించారు.
No comments:
Post a Comment