కోవిడ్ నిర్మూలనలో భాగస్వామ్యులు కండి
ఉదయం 6నుంచి సాయంత్రం వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి
మాస్కులు ఉంటేనే విక్రయాలు జరపాలి
వ్యాపారస్తులకు అధికారుల ఆదేశాలు
వరదయ్యపాలెం, పెన్ పవర్
కరోనా రెండోదశ వ్యాపిస్తున్న నేపద్యంలో కోవిడ్ నివారణకు వ్యాపారులు భాగస్వామ్యులు కావాలని ఎస్సై పురుషోత్తం రెడ్డి,తహశీల్దార్ చిన్నయ్య, ఎంపిడిఓ జగదీశ్వర్ రెడ్డి,ఈఓ యూసఫ్ ఖాన్ పిలుపు ఇచ్చారు. వరదయ్య పాలెం పంచాయతీ ఆర్ ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన వ్యాపారుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూప్రజారక్షణలో బాగంగా ఇకపై రేపటి నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. నిత్యం సరుకుల కొనుగోలుకు వచ్చే ప్రజలకు తప్పనిసరిగా మాస్కలు ఉంటేనే విక్రయించాలని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులు సహకారం అందించికోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ కరోనా నివారణకు సహకారం అందించాలని కోరారు.
No comments:
Post a Comment