సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం
విజయనగరం,పెన్ పవర్మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ ప్రణాళిక అధికారులు, వార్డు ప్రణాళికా మరియు వెల్ఫేర్ కార్యదర్శులుతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం ప్రకారం మూడు కేటగిరీల లో ఇళ్ల స్థలాలను లే అవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి అందించేందుకు నిర్ణయించిందన్నారు. ఇందుకోసమై వార్డు ప్రణాళిక కార్యదర్శులు లబ్దిదారుల ప్రాధమిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
లాభం లేకుండా, నష్టం కలగకుండా ప్రభుత్వమే లేఅవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి స్థలాలను అందించే బృహత్తర కార్యక్రమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని బట్టి స్థల విస్తీర్ణం మంజూరు చేయబడుతుందని అన్నారు. 150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీలుగా యం.ఐ.జి. స్థలాలు పంపిణీ ఉంటుందన్నారు.3 లక్షల నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించనున్నారని తెలిపారు. ఇందుకోసమే ప్రాథమిక సమాచార సేకరణకు ప్రతి ఇంటికి వచ్చే వార్డు కార్యదర్శులకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్నారు.అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, పట్టణ ప్రణాళిక అధికారులు కనకారావు,శ్రీలక్ష్మి ,టీపీఎస్ జనార్ధన్, సర్వేయర్ సింహాచలం, వార్డు ప్రణాళికా కార్యదర్శులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment