తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: లింగంగౌడ్ జాజుల
తార్నాక , పెన్ పవర్రోజు,రోజుకు వేలల్లో కరోనా కేసులు పెరుగుతున్నoదున కరోనా బారిన పడి ఏ ఒక్క వ్యక్తి చనిపోకుండా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అందరికి మెరుగైన వైద్యం అందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసి కరోనా చికిత్స పేరుతో పేదల దగ్గర నుండి లక్షలకు లక్షలు ఫీజులు వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆసుపత్రుల గుర్తింపు రద్దు చేయాలన్నారు. కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులున్న కార్పొరేట్ ఆసుపత్రులు వీటిని నిరాకరిస్తు డబ్బులు కడితేనే కరోనా చికిత్స చేస్తామంటు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అన్ని హెల్త్ స్కీంల కింద ఉచిత చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే రెమిసివిడియర్,తదితర డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్లో వేలకు వేల రూపాయలు అదనంగా అమ్ముకుంటున్న దళారులపై క్రిమినల్ కేస్లు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment