పోలవరం ప్రాజెక్ట్ లో జగన్ రెడ్డి దోపిడీ
నర్సీపట్నం, పెన్ పవర్
పోలవరం ప్రాజెక్ట్ లో జగన్ రెడ్డి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, ఒక్కసారి కళ్లుతెరచి చూడండిరా బాబూ.. అంటూ తనదైన శైలిలో విమర్సలు కురిపిస్తూ అయ్యన్నపాత్రుడు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఆలీబాబా 40 దొంగల్లా, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ లో 780 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం, రెండు సంవత్సరాలలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 3222 కోట్లు ఎందుకు పెంచారో, ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన డాం అంచనావ్యయం రాత్రికి రాత్రి 1600 కోట్లు పెంచడం దారుణమన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇచ్చారని, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇసుకకే 500 కోట్లు బిల్లులు చెల్లించారని, దీనిని బట్టే ఎ1 దోపిడీ, ఎంట దారుణంగా ఉందో అర్ధమవుతుందన్నారు. పోలవరం ఖర్చుల వివరాలతో మంత్రి అనిల్ కుమార్ శ్వేతపత్రం విడుదల చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు. పట్టిసీమ దండగ అన్న మీరు, పోలవరం కుడికాలువపై 912 కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని, మన సంక్షేమ పథకాలు మనకు వస్తున్నాయని ఊరుకుంటే, పిల్లల భవిష్యత్ ఏమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కమిషన్ల మీద వున్న శ్రద్ధ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యడంలో లేకపోవడం ఆంధ్ర ప్రజల దరదుష్టమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టి అధికారులను పరుగులెత్తించి పనులు వేగంగా జరిపించారని గుర్తు చేశారు. టిడిపి హయాంలో 72% పనులు చేస్తే, ఈరెండు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం 1% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా, ముఖ్యమంత్రి దొడ్డి దారిన దోపిడీకి పాల్పడ్డారని విమర్సించారు. ఇప్పటికే ఇసుక, మద్యం, ఇళ్లస్థలాలకు భూసేకరణలోనూ మీరు, మీ ఎమ్మెల్యేలు అడ్డంగా దోచుకున్నారు. అన్నం పెట్టే రైతులకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా దోచుకోవాలా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుట్టినరోజున, ట్విట్టర్ లో సాయిరెడ్డి తప్పుగా మాట్లాడారని ఆగ్రహించారు. జైల్లో చిప్పకూడు తిన్న సాయిరెడ్డికి, చంద్రబాబును విమర్సించే స్థాయిలేదన్నారు. దొడ్డి దారిన రాజ్యసభ సభ్యుడైన సాయిరెడ్డి, ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని విమర్సించారు. ప్రపంచస్థాయి నాయకుడైన చంద్రబాబును విమర్సిస్తే, దారుణ పరాభవం పొందాల్సి ఉంటుందన్నారు.
No comments:
Post a Comment