ఉపాధి పనులను ఆపిన సుబ్బయ్యమ్మ పేట ఫీల్డ్ అసిస్టెంట్
గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో గురువారం ఉపాధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్ (గురువారం పనిలేదని) నిలిపివేశారని గ్రామ సర్పంచ్ బొబ్బర శివ గ్రామస్తులు ఆరోపించారు. కరోన విపత్కర పరిస్థితుల్లో గ్రామస్తులకు పూట గడవడం కష్టంగా ఉందని అటువంటి సమయంలో ఉపాధి పనులను నిలిపివేస్తే కూలి పనులు చేసుకునే వారు ఏ విధంగా జీవనం సాగిస్తారని సర్పంచ్ శివ అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టానుసారంగా పనులు నిలిపివేస్తే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ఎపిఓ గంగాభవాని మాట్లాడుతూ పనులు ఆపమని మేము చెప్పలేదని దీనిపై విచారణ జరిపి ఫీల్డ్ అసిస్టెంట్ కి మేమో ఇస్తామని చెప్పారు చెప్పారు.
No comments:
Post a Comment