Followers

మా ఎంపి త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలి

 మా ఎంపి త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలి

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు.

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ ఎం పి మాలోత్ కవిత శుక్రవారం కరోనా నిర్దారణ పరీక్ష చేసుకోగ ఆమెకుకరోనా  పాజిటివ్ గా నిర్దారణ అయుంది. దీనితో ఆమె కరోనా నుండి త్వరగా కోలుకోవాలని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలం తారసింగ్ బావి తండాలో గల హనుమాన్ గుడిలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కవితక్క అభిమాని కొయ్యడి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, నిరంతరం ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడే  మా  ఎం పి మాలోత్ కవితక్క కరోనా నుండి త్వరగా కోలుకొని మహుబూబాబాద్ ప్రజలకు సేవ చేయాలని ఆంజనేయస్వామి ని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కొయ్యడి వెంకన్న గౌడ్, కవితక్క అభిమానులు, తండావాసులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...