Followers

అందిన సమాచారం మేరకు పరిశీలన...

 అందిన సమాచారం మేరకు పరిశీలన...

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని, కొండ లింగాలవలస పంచాయతీ, శివారు తాటిపూడి వలస గిరిజన గ్రామం సమీపంలో అక్రమంగా మైనింగ్ మాఫియా తవ్వకాలు చేపడుతున్నారని అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తాసిల్దార్ దూసి రవి వెల్లడించారు. అక్కడ పలువురు వ్యక్తులు తవ్వకాలు చేపట్టి మైనింగ్ రాళ్లను వేరే ప్రాంతానికి తరలించి నట్లు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. మీకు ఎవరు ఎక్కడ మైనింగ్ రాళ్లను తమన్నా రని కూలీలను అడిగితే మాకు తెలియదని వారు చెబుతున్నారు అని తాసిల్దారు రవి పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ భూమిని మైనింగ్ తవ్వకాలకు చేపట్టరాదని కూలీలకు ఆయన తెలియజేశారు. ఎక్కడ మైనింగ్ తవ్వకాలకు తాసిల్దార్ కార్యాలయం నుంచి గాని,  మైనింగ్ డిపార్ట్మెంట్ వారు గాని ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తాసిల్దార్ రవి తెలిపారు.

 ఆయనతో పాటు మండల సర్వేయర్ దాసరి సత్యం, కొండ లింగాలవలస పంచాయతీ తాజా, మాజీ సర్పంచులు పాడి వరహాల అమ్మ, సిరిపురపు నాగమణి పాల్గొన్నారు. అయితే గత కొన్నేళ్లుగా మైనింగ్ మాఫియా తవ్వకాలు ఇక్కడ జరుగుతున్నట్లు సమాచారం. అక్కడ కొంతమంది రాజకీయ నేతలకు, పలువురు గిరిజనులకు మైనింగ్ మాఫియా వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ మాఫియా వాళ్ళు ప్రస్తుతము ఎవరికీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారాన్ని అక్కడ వారే కొంతమంది తాసిల్దార్ రవికి, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం అందజేశారని మరో కోణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ రవి సందర్శించిన అనంతరం మైనింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...