ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం
మహారాణి పేట, పెన్ పవర్
5వ రోజు దీక్షా శిబిరంలో అజశర్మ పిలుపు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా పోరాటాల ద్వారానే కాపాడుకోవాలని, అందుకు ప్రజలు సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజశర్మ 5వ రోజు నిరాహారదీక్ష లో కూర్చున్న వారికి పూలదండలు వేసి పిలుపునిచ్చారు.దీక్షలో కూర్చున్న వారిలో సీబబీయూ నాయకలు పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, కె.కుమారి, పి. చెంకటరావు బేగం, పోతురాజు, ఎఐటీయూసీ నాయకులు వామనమూర్తి, చి.వెంకటేశ్వరరావు, బద్వా మౌనిక, యస్,. యఫ్.ఐ రాఘవేంద్రరావు తదితరులు దీక్షలో కూర్చొన్నారు.అజశర్మ మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం బరితెగించి ప్రభుత్వ రంగాన్ని అమ్ముతామని చెప్పడం సిగ్గుచేటన్నారు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో 15లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచాడు తప్పా ప్రభుత్వ పరిశ్రమలు అమ్ముతామని, ధరలు పెంచుతామని చెప్పలేదు. ఆ రకంగా చెప్పి ఉంటే ప్రధాని గా మోడీ ఉండేవారు కాదని అన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖనగరం ఆర్థిక రాజధాని గా మంచి పేరు ఉందంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటమే ఆది సాధ్యమైందన్నారు. నగరంలో అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి దొరుకుతుందంటే స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు ఉన్నాయికాబట్టేనని తెలిపారు. లాభాల్లో వుండే పరిశ్రమలను, ప్రజల ఆస్టులు అమ్మితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రైతులు, కార్మికులు కలిసి పోరాడితే బిజెపికి పుట్టగతులు వుండవన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ దీక్షలో సీఐటీయూ నగర అధ్యక్షులు ఆర్.కె.యస్ హీర్, ఏఐబీయూసీ జిల్లా అధ్యక్షులు పదాల రమణ, బద్వా కార్యదర్శి డా. జి.ప్రియాంక, యస్.యఫ్. ఐ కార్యదర్శి యల్.కె.నాయుడు, పిడియస్ఓ అధ్యక్షులు సురేష్, డివైయఫ్ ఐ కార్యదర్శి యు.యస్.యన్.రాజు, ఏఐటీయూసీ రెహమాన్, మన్మధరావు, సీఐటీయూ నగర కార్యదర్శి బి.జగన్, ప్రజానాట్యమండలి చంటి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment