తాళ్లపూడి మండలంలో రెడ్ జోన్లు
కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెడ్ జోన్ లు దర్శనమిస్తున్నాయి. మండలంలో పలు పంచాయతీల కార్యదర్శులు కరోన కేసులు ఉన్న చోట్ల రెడ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది ప్రజలు కరోన పోజిటివ్ ఉన్న సమాజంలో తిరగడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించి, కరోన పోజిటివ్ కలిగిన వ్యక్తులు బయట తిరగకుండా హోం ఐసోలేషన్ లో ఉంటే అందరికీ మంచిదని పలువురు భావిస్తున్నారు.
No comments:
Post a Comment