మద్దెల కృష్ణ హఠాన్మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మద్దెల కృష్ణ మరణం చెందడం పట్ల స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మరణవార్త ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చురుకైన అంకితభావం గల యువకుడు కృష్ణ హఠాన్మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కృష్ణ మరణం వ్యక్తిగతంగా తన మనసును ఎంతగానో కలచివేసినదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కృష్ణ చిన్న వయసులోనే కన్నుమూయడం దురదృష్టకరమని అన్నారు. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తూ నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులు కృష్ణ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ కలుపుగోలుగా ఉండే కృష్ణ ఇంక లేరు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుని ప్రార్ధించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment