మాస్క్ పెట్టు..లేదా.. ఫైన్ కట్టు..
పేద ప్రజలకు, బాటసారులకు,దినసరి కూలీలకు మాస్కులు పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్త..
నాడు సామాజిక దూరాన్ని పాటించాలని పదే పదే ప్రచారం..నేడు ప్రచారంతో పాటు మాస్కుల పంపిణీ
సామాజిక సేవతో మన్ననలు పొందుతున్న సోషల్ వర్కర్ కొత్త లా రవిందర్ ముదిరాజ్..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్ఎలాంటి విపత్తులు ఏర్పడినా అక్కడ ఆసామాజిక కార్యకర్త తనవంతు సహాయ సహకారాలు అందింస్తూనే ఉంటాడు.. అతనే సామజిక కార్యకర్త కోలా రవిందర్ ముదిరాజ్.. గత కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవలందించిన ఆయన ఇపుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద.. అడ్డాకూలీల వద్దకు చేరుకొని ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు.. రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు రవిందర్ బాసటగా నిలుస్తున్నాడు. కుత్బుల్లాపూర్ సూరారం గ్రామనికి చెందిన కోలా రవిందర్ ముదిరాజ్ ఎన్నో యేండ్లుగా సామాజిక సేవచేస్తుంటాడు.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు నడుంబిగించి ప్రజలను చైతన్యపర్చారు.. భూగర్భజలాలు నీటి నిల్వలు పెంచడానికి ప్రతి ఇంటిలో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి ఇనుకుడు గుంతల ఏర్పాటుకు అవగాహన కల్పించాడు.. ఇపుడు సూరారం ఎక్స్ రోడ్డులో నిలబడి వచ్చే పోయే వారికి మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని కోరుతున్నారు.. మాస్కులు లేని బాటసారులకు మాస్కును ధరించాలని, కరోన వైరస్ ఉగ్ర రూపం దాలుస్తుందని, సామాజిక దూరం పాటించి, నిబందనలు పాటించాలని రవిందర్ సూచిస్తున్నారు.. మాస్కులు ధరించకుంటె జరిమానాలు.. మాస్కులు దరించని వారికి జరిమానాలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం జీవోజారీ చేయడంతో ప్రజలజు కొంత ఇబ్బందిగా మారినా..తప్పని పరిస్థితి అందుకే సామాజిక కార్యకర్త రవిందర్ ముదిరాజ్ సోమవారం సూరారం ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడి మాస్కులు దరించని వారికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.. వైరస్ విజృంభణ గురించి తెలియజేస్తూ సామాజిక దూరం పాటించాలని, వివరించారు.. ఆటొలను నిలిపి మాస్కులు పంపిణీ చేశారు..మాస్కులు లేని పాదచారలకు, దినసరి కూలీలకు మాస్కులను ఇచ్చారు..ఫైన్ వద్దు.. మస్కులే ముద్దు అని ప్రచారం చేస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మన ప్రయత్నం మనం చేయాలని సామాజిక కార్యకర్త రవిందర్ ముదిరాజ్ సూచించారు..
No comments:
Post a Comment