Followers

గో మహా గర్జనలో అన్నదాన సేవలు

 గో మహా గర్జనలో అన్నదాన సేవలు 

అన్నదాన సేవలను గుర్తించి వారిని సత్కరించిన 

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి

పెన్ పవర్, మల్కాజిగిరి 

యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ మరియు టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన  గో మహా గర్జనలో ముఖ్య  అతిథిగా పాల్గొన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.  ఈ కార్యక్రమంలో యుగతులసి ఫౌండేషన్ ద్వారా నందనంపాటి విరాంజనేయులు, రామాంజనేయులు, (రాము) ఆధ్వర్యంలో డా.ఏ.ఎస్.రావు నగర్ పద్మశాలి భవన్ లో గో మహా గర్జనలో అన్నదాన సేవ కార్యక్రమం ఏర్పాటు భాగంగ, వంటలు చేసి ఎన్టీఆర్ స్టేడియంకు తీసుకెళ్ళి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. యుగతులసి పౌండేషన్ నందనంపాటి విరాంజనేయులు, రామాంజనేయులు చేస్తున్నా అన్నదాన సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి నందనంపాటి రాము మరియు కుషాయిగూడ లైన్స్ హాస్పిటల్ చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు  జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ కుషాయిగూడ (హెచ్.పీ ) వరప్రసాద్, శ్రీను, మరియు శంకర్ బాబు, సోలిస్ హాస్పిటల్ ఇంచార్జి విజేందర్ రెడ్డి, డాక్టర్. కోటేశ్వరరావు, సుబ్బారావు, రాజగోపాల నాయుడు మరియు  సోలీస్ కంటి ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...