అస్తమించిన రవి
వానపల్లి రవికుమార్ మృతి పేద ప్రజలకు తీరని నష్టం
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి సంతాపం
జిల్లా ప్రజా నాట్యమండలి ప్రగాఢ సంతాపం
ఇప్పటివరకు 980 అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసిన రవి
ఆత్మబంధువు కి కడసారి గా కన్నీటి వీడ్కోలు
అంత్యక్రియాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న అభిమానులు
టీడీపీ కార్పొరేటర్ రవికుమార్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం
పార్టీలకతీతంగా సంతాపం ప్రకటించిన నాయకులు
(న్యూస్ నెట్ వర్క్ పెన్ పవర్, విశాఖపట్నం )
స్నేహాశీలి, ఓటమికి పాఠాలు నేర్పి...విజయ రహస్యం తెలిపిన ప్రజల నాయకుడు, అనాథ మృతదేహాలకు ఆయనే బంధువై కర్మకాండలు చేసే ఆత్మీయుడు, 31 వ వార్డు టీడీపీ కార్పోరేటర్, సాయి పూజా ఫౌండేషన్ ఛైర్మన్, ప్రముఖ సంఘ సేవకుడు వానపల్లి రవికుమార్ సోమవారం ఉదయం స్థానిక ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ వార్డు లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, అయన నుండి సేవలు పొందిన నిరుపేదలు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. రవికుమార్ రాజకీయాలకు అతీతంగా సేవలు అందించేవారు. తన వద్దకు సహాయం కోసం వచ్చేవారికి తన శక్తి మేరకు ఆపన్న హస్తం అందించారు. సాయిపూజ ఫౌండేషన్ పేరిట నిరంతరం సేవాకార్యక్రమాలు నిర్వహించారు .
అనాధ శవాలకు అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తూ మానవత్వం గల మనిషిగా పేరుపొందారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి చేయూతనిచ్చేవారు. అనారోగ్యం తో బాధపడే పేదలకు వైద్యం చేయించేవారు. నిరుపేదలకు ప్రతి నెల బియ్యం.. నిత్యావసర సరుకులు అందించేవారు. ఇలా ఎన్నో విధాలుగా సేవలు పొందిన వారు..ఇప్పుడు తామంతా ఆత్మీయుడిని కోల్పోయామని కన్నీరుమున్నీరయ్యారు. గత ఏడాది నుంచి కరోనా విలయ తాండవం చేస్తున్న పట్టించుకోకుండా ఇప్పటివరకు 980 అనాధ శవాలకు అంతిమ సంస్కారాల ను చేసి తను ఉండే ప్రతి చోట తనదైన శైలిలో విద్యా, వైద్య ,సేవా రంగాల్లో సేవలు చేసినటువంటి వానపల్లి రవి కుమార్ కి కడసారి గా కన్నీటి వీడ్కోలు అర్పించారు. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతిపట్ల చంద్రబాబునాయుడు గారు సంతాపం
జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. కరోనా బారిన పడి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న రవికుమార్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. రవికుమార్ కుటుంబసభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ... చిరునవ్వు ముగబోయిందని, అన్నార్తులకు ఆకలి తీర్చే వానపల్లి రవికుమార్ ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నానని అన్నారు. గత 10 రోజులుగా ఆస్తమాతో పోరాడుతూ కరోనా మహమ్మారికి బలైపోయారన్న దుర్వార్థ సోమవారం ఉదయాన్నే వినాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. 2007 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున 27 వార్డు నుండి, మొన్న 2021 మార్చి10 జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 31 వార్డు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన రవికుమార్ మంచి స్నేహశీలి, నిరాడంబరుడు, అని ఆయన అన్నారు. సాయి పూజ ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం "మార్చి నుండి అన్నార్తులకు ఆకలి తీర్చిన మంచి మనిషి అని . చివరికి రహదారిపై ఆకలితో ఎవరు కడబడనంత వరకు కూడా బోజనాల సరఫరా ఆపలేదు. విశాఖ నగరంలో ఎ అనాధ శవాలు కనబడినా ఎవరైనా సమాచారాన్ని అందివ్వగలితే తక్షణమే అక్కడ వాలిపో యీ వారికి అంతిక్రియలు నిర్వహించే రవికుమార్ ఇకలేరు అని సత్యనారాయణ సంతాపం తెలుపుతూ కుటుంబం సబ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. స్థానిక సంస్థ నుండి ఎన్నికైన మంచి ప్రజలమనిషి రవికుమార్ మృతి పట్ల విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు సీహెచ్ రాఘవేంద్రరావు, సీపీఐ కార్పొరేటర్ ఎ జె స్టాలిన్ నగర కార్యదర్శి ఎం పైడిరాజు ఎ పి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ విమల తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 31వ వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి కి విశాఖ జిల్లా సమితి, జిల్లా ప్రజా నాట్యమండలి ప్రగాఢ సంతాపం తెలిపింది. సేవాదృక్పదం గల మానవతావాది అయిన రవికుమార్ మృతి 31వార్డు ప్రజలకు తీరని లోటని జిల్లా ప్రజా నాట్యమండలి అధ్యక్షులు చిరంజీవి, కార్యదర్శి అప్పారావు, నాయకులు జి. కాసురెడ్డి, దేవుడమ్మ, రమణ లు అన్నారు.
No comments:
Post a Comment