Followers

పి. సి. సి /పి. వి. సి సర్టిఫికెట్లు ఇక నుండి ఆన్ లైన్ లో పొందవచ్చు.

 పి. సి. సి /పి. వి. సి సర్టిఫికెట్లు ఇక నుండి ఆన్ లైన్ లో పొందవచ్చు. 

మంచిర్యాల, పెన్ పవర్

ప్రజలు లేదా సంస్థలు పి సి సి (పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ), పి వి సి (పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్) గురించి ఇకనుండి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్లకు, లేదా మీ సేవకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్ లో అప్లై చేయడం కోసం కొత్తగా తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక వెబ్  సైట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన i-verify  అనే  సేవలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రారంభించారని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ గారు పత్రికా ప్రకటనలో తెలిపారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వివిధ సంస్థలలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం పొందడానికి లేదా విదేశాలకు వెళ్లడానికి లేదా విదేశాలలో ఉద్యోగాలు పొంది ఆయా సంస్థల లో చేరడానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్/ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లు ఆయా సంస్థలు అడుగుతుంటారు. ఈ సర్టిఫికెట్లను   పొందడానికి ఇంతకుముందు వరకు జిల్లా పోలీస్ కార్యాలయాలకు రావాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ఈ సేవల ద్వారా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరమైన ఏ వ్యక్తి అయినా తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక వెబ్సైట్ pvc.tspolice.gov.in ఓపెన్ చేసి అందులో యూజర్ గైడ్ ఓపెన్ చేసి చదువుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో నే నేరుగా ఆన్లైన్ ద్వారా చాలాన్ పేమెంట్ చేసే వెసలుబాటు కల్పించబడింది. అప్లికేషన్  సంబంధిత కమిషనరేట్ యూనిట్కు వెళ్తుంది వారు వెరిఫై చేసిన తర్వాత మీరు కోరిన విధంగా స్పీడ్ పోస్ట్ లేదా, నేరుగా మీకు అప్పగించబడిన అప్లైచేసిన తర్వాత తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సేవలను అవసరమైన అందరు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ   ఐపీఎస్ తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...