ఇరుకు రోడ్లు వాహనదారులు అవస్థలు
మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రం మెంటాడ తోపాటు జక్కువ, చింతలవలస, కైలం, చల్లపేట, మెంటాడ నుంచి ఆండ్ర, మెంటాడ నుంచి గజపతినగరం ప్రధాన రహదారులు కూడా ఇరుకుగా ఉన్నాయి. రోజు వందలాది ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలతో పాటు బస్సులు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి.
ఎదురెదురుగా వచ్చిన సమయంలో వాహనదారులు తప్పించడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తప్పించిన సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంత జరిగినా రాజకీయ నాయకులు, సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు చీమ ట్టినట్లయినా కనిపించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రస్తుత పాలకులు, సంబంధిత అధికారులు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment