విద్య రంగంలో ఎంఈఓ రాజయ్య సేవలు మరువలేనివి
సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్విద్యారంగంలో ఎంఈఓ మంకు రాజయ్య సేవలు మరువలేనివని రాచర్ల బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గల జ్ఞానదీప్ హైస్కూల్లో మండల విద్యాధికారి మంకు రాజయ్య మరియు వెంకటాపురం ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి లకు ఉపాధ్యాయ బృందం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరోనాతో మరణించిన ఎంఈఓ మంకు రాజయ్య మరియు ఉపాధ్యాయుడు ఓలాద్రి యాదగిరిరెడ్డి లకు జ్ఞానదీప్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం మేనేజ్మెంట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు నివాళులు అర్పించి వాళ్ళు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంఈఓ మంకు రాజయ్య ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో అహర్నిశలు కృషి చేశాడని ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత మంకు రాజయ్య కు దక్కుతుందని అన్నారు. అనంతరం సర్పంచ్ కొండపురం బాల్ రెడ్డి మాట్లాడుతూ మంకు రాజయ్య కరోనాతో చనిపోవడం వలన మన రాష్ట్రము మంచి విద్యావేత్త ను కోల్పోయిందని అన్నారు. విద్యా రంగంలో అహర్నిశలు కృషి చేసి విద్యావ్యవస్థను మార్పు తెచ్చింది ఎంఈఓ మంకు రాజయ్య అని అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పాఠశాలలు అన్నీ ఒక మంచి స్థాయిలో ఉన్నాయి అంటే దానికి కారణం మంకు రాజయ్య అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాలలు గా మార్చిండని రమేష్ గౌడ్ అన్నారు. రాజయ్య మరణము విద్యా రంగానికి తీరని లోటు అని అన్నారు. రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం మండల వనరుల కేంద్రం ను మంకు రాజయ్య కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వాన్ని కొండ రమేష్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞానదీప్ స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్. సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి. ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయులు బాలయ్య మారుపాక రాజు డాక్టర్ భాను ప్రేమ్ సాగర్ రవీందర్, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు
No comments:
Post a Comment