అదే నిర్లక్ష్యం... అదే వైపల్యం...
రెండో రోజు పెద్ద ఆసుపత్రిలో అదే సీను
అక్షిజన్ అందక రోగులు విలవిల
విజయనగరం, బ్యూరో పెన్ పవర్
ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇది నిన్నటి మాట అయితే విజయనగరం పెద్ద ఆసుపత్రిలో అదే సీను రిపీట్ అయ్యింది. ప్రాణ వాయువు అందక రోగులు విల విలాడుతున్నారు. సోమవారం వేకువజామున సంఘటన మరువక ముందే మరోసారి అధికారులు నిర్లక్ష్యం, వైపల్యం, కరోనా రోగులకు శాపంగా మారింది. మంగళవారం సాయంత్రం నుంచి అక్షిజన్ అందక రోగులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. అయ్యితే అధికారులు మాత్రం పైడి భీమవరం నుంచి ట్యాంకర్ బయలు దేరింది అంటూ చెప్పడం విడ్డురంగా ఉందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ పేషేంట్ల పట్ల ఇలా మానవత్వం మరచి వ్యహరిస్తున్న అధికారుల తీరుపై పలువురు మండి పడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటన లకు వాస్తవం గ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని అంతా వాపోతున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి తగు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
No comments:
Post a Comment