శ్రీరామకృష్ణకు రసాయన శాస్త్రంలో డాక్టరేట్
పెన్ పవర్,ఆలమూరు
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన సూరపరెడ్డి శ్రీరామకృష్ణ రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆచార్య డాక్టర్ రవీంద్రనాథ్ కుంట పర్యవేక్షణలో "అరుదైన చక్కెర వాటి ప్రోసెసింగ్ సంబంధిత మలినాల విశ్లేషణ కోసం నోవెల్ క్యాపిల్లరీ ఎలక్ట్రో ఫోరెసిస్ పద్ధతి అభివృద్ధి" అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి కేఎల్ యూనివర్శిటీ రిజిస్టార్ ఆచార్య వై వి ఎస్ ఎస్ వి ప్రసాద్ రసాయన శాస్త్రంలో ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. ఆలమూరు మండలానికి చెందిన సూరపురెడ్డి శ్రీరామకృష్ణకు ఈ అరుదైన డాక్టరేట్ సాధించడంతో పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, సంధిపూడి సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, పెదపల్ల సర్పంచ్ యేడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైవీవీ రమణ పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
No comments:
Post a Comment