సంఘం భవనంకు స్థలం కేటాయించాలని వినతి
లక్షెట్టిపెట్, పెన్ పవర్పట్టణంలో విశ్వకర్మ ఐక్య సంఘం భవనంకు స్థలం కేటాయించాలని కోరుతూ సంఘం సభ్యులు శనివారం తహసీల్దార్ రాజుకుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఐదు కులాలు కలిసి సంఘం ఏర్పాటు చేసుకున్నామని ఐదు కులాల సమస్యలు అభివృద్ధికై సమావేశాలు పెట్టుకునేందుకు భవనం నిర్మాణం చేసుకుంటామని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బాణాల రమేష్, ప్రధాన కార్యదర్శి నస్పూరి దీప్చంద్, కోశాధికారి రఘువాచరి, ప్రసాద్, సత్యనారాయణ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment