అన్ని రంగాల్లో ఆదిలాబాద్ యువత ముందుకు వెళ్లాలి...
స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారెంగుల ప్రణయ్
ఆదిలాబాద్ , పెన్ పవర్
అన్ని రంగాల్లో ఆదిలాబాద్ యువత ముందుకు వెళ్లాలని స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారెంగుల ప్రణయ్ అన్నారు. ఆదిలాబాద్ యువత చెయ్ పూర్తి బాధ్యత గా నిర్మించబడ్డ మర్మం అనే వెబ్ సిరీస్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా కారెంగుల ప్రణయ్ మాట్లాడుతూ కళ ఎదైనా మన కృషి కి గుర్తింపు దక్కాలి, ఏ పనికైనా కావల్సింది నైపుణ్యం,అది సాధించిన ప్రతీ ఒక్కరూ గెలిచినట్టే లెక్క అని అన్నారు.తమలోని కళ కి పదును పెట్టే ప్రతీ ఒక్కరికీ నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు."మర్మం" టీమ్ అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, మర్మం టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment