Followers

కూరగాయల షాపులకు స్థలాల నిర్ణయం

 కూరగాయల షాపులకు  స్థలాల నిర్ణయం         

పెన్ పవర్, కందుకూరు

కందుకూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో  కోవిడ్ దృష్ట్యా కూరగాయల వ్యాపారస్తుల తో సమావేశమైన కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గణేశం శిరీషా గంగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ఇప్పటికే రెండుసార్లు రూపాంతరం చెందింది. ఒక కుటుంబంలో ఒకరికి సోకితే మరుక్షణమే ఆ కుటుంబం మొత్తం వ్యాపిస్తుంది అని అన్నారు. కావున రోజు రోజుకి కరోనా మహమ్మారి పెరుగుతున్న దృష్ట్యా కూరగాయల మార్కెట్ ను బహిరంగ ప్రదేశాలలో పెడితే ప్రజలకి వ్యాపారస్తులకు మంచిదని, గతంలోఉన్న అనుభవంతో మున్సిపల్ అధికారులు మీకు స్థలాలు కేటాయిస్తారని తెలిపారు.కూరగాయల హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తుల యొక్క అభిప్రాయాలను తీసుకుని మీకు షాపులను కేటాయిస్తామని తెలిపారు.  తహసీల్దార్ మాట్లాడుతూ ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న అందువల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మంచి మాస్కులు ధరిస్తూ,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాలు సాగించాలని అన్నారు. 

ఆదివారం కూరగాయల మార్కెట్లో తో సహా అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలని చెప్పారు.మునిసిపల్  కమీషనర్ మనోహర్ మాట్లాడుతూ  హోల్ సెల్ వారికి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో, రిటైల్ వ్యాపారస్తులకు పట్టణంలో ఆరు ప్రదేశాలు నిర్ణయించారు. రైతుబజార్ ప్రక్కన, గుడ్లూరు రోడ్డునందు, హైస్కులు ఆవరణలో, అంకమ్మ దేవాలయం వద్ద, ఎల్ ఐ సి ఆఫీస్ ప్రక్కన, ఎన్ టి ఆర్ విగ్రహం వెనుక నిర్ణయించారు. శనివారం మునిసిపల్ ఆఫీస్ నందు షాపుల విక్రయాల పాసులు, ఐడీ కార్డులు ఏర్పాటు చేస్తారు. రేపు రైతు బజార్ నందు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతుంది అని కమీషనర్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికే షాపులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి వ్యాపార సముదాయం వద్ద మునిసిపల్ వారి ధరల పట్టిక ప్రచురిస్తామని, ప్రచురించిన ధరల కన్నా ఎక్కువ అమ్మితే వారి షాపు ని రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరీష గంగిరెడ్డి, వైస్ చైర్మన్ మేకనబోయిన శ్రీనివాసులు,  పట్టణ ఎస్ఐ కేకే  తిరుపతిరావు, ఎస్టేట్ మేనేజర్ స్వరూప, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...