షర్మిల దీక్ష కు మద్దతుగా ఓయూ విద్యార్థులు
తార్నాక, పెన్ పవర్
షర్మిల దీక్ష కు మద్దతుగా ఓయూ విద్యార్థి జేఏసీ ఛైర్మెన్ రవి నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలివెళ్లారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ షర్మిల దీక్ష తొలి రోజు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసిన వైఎస్ షర్మిలకు మరో రోజు అనుమతి ఇవ్వకపోవడంతో లోటస్ పాండ్ లోనే దీక్షను కొనసాగించారు. ఆదివారం దీక్ష ముగింపుకు ఓయూ విద్యార్థులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా ఓయూ లో విద్యార్ధి నేత,తెలంగాణ ఉద్యమకారుడు రవి నాయక్ మాట్లాడుతూ, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పిట్టలా రాలిపోతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. నిరుద్యోగుల కోసం భవిష్యత్తులో షర్మిల ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఓయూ విద్యార్ధి నాయకుడు రవి నాయక్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో షర్మిల కు మద్దతు గా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిస్తాం అని,వర్సిటీలో వీసీ లు నియమించాలని, ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని షర్మిల తో ఓయూలో దీక్ష చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్ విజయ నాయక్, స్వప్న, శంకర్, నరసింహ శ్రీను, రమేష్, నరేష్, తార సింగ్, అంజి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment