కాంటాక్టుల ట్రెసింగ్ లో సాంకేతికతను జోడించండి
శాంపిల్స్ పంపడానికి రవాణా వాహనాలను పెంచండి
ఎప్పటికప్పుడు శ్యాంఫుల్స్ ల్యాబ్ లకు పంపండి
ఫలితాలను వీలైనంత తొందరగా వచ్చేటట్లు చూడాలి
ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్
చిత్తూరు, పెన్ పవర్.రోజురోజుకు కోవిద్ కేసులు పెరుగుతున్నాయి, కాబట్టి 104 కాల్ సెంటర్ ద్వారా కాంట్రాక్టుల రేసింగ్ సంబంధించి సాంకేతికతను పెంచి ఎప్పటి కప్పుడు అవసరమైన చోట్ల టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాలని అదేవిధంగా టెంపుల్స్ ను తిరుపతి ల్యాబ్కు వీలైనంత తొందరగా పంపి ఫలితాలు వచ్చేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను అందులో సిబ్బంది ఎవరెవరు ఏమి పని చేస్తున్నారు. వివరంగా తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో సమావేశాన్ని నిర్వహించి 104 ద్వారా వస్తున్న ఫోన్ కాల్స్ కు సంబంధించి సిబ్బంది ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారని అందుకోసం సాంకేతికతను జోడించాలని కాంట్రాక్టుల ట్రేస్సింగ్ వేగంగా చేసి ఎవరైనా అనుమానా స్పదంగా ఉంటే వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆ విధంగా పరీక్షలు నిర్వహించి సకాలం లో తిరుపతి లోని స్విమ్స్ లేదా రుయా ఆసుపత్రి లేబరేటరీ లకు పంపాలని అందుకోసం జిల్లా వ్యాప్తంగా వాహనాలను ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేకరించిన శాంపిల్స్ను ఆ వాహనాల ద్వారా రాత్రి 11 గంటలకు లాబరేటరీ లకు చేర్చాలని అలా చేస్తే వారు మరుసటి రోజున ఫలితాలను ఇవ్వడానికి వీలు ఉంటుందని ఈ లోగ వ్యాధి నిర్ధారణ అయితే కొంత వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని జిల్లా కలెక్టర్ అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హోంయ్యర్ ద్వారా పరీక్షల సామర్థ్యాన్ని పెంచి వేగంగా ఫలితాలను ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన మరికొన్ని లేబరేటరీ లలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులలో ఇప్పటివరకు ఆక్సిజన్ లభ్యత గురించి పంపిణీ గురించి తెలుసుకున్న కలెక్టర్ రోజురోజుకు అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ సరఫరా ను ఇబ్బంది లేకుండా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్(అభివృద్ధి)వీరబ్రహ్మం, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బసిరెడ్డి, డి సి హెచ్ ఎస్ సరళమ్మ,, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ యుగంధర్, ఇతర కోవిడ్ అధికారులతోపాటు డి పి ఎమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment