మండలంలో టిడిపి&బిజెపి ల నుంచి వైసిపి లోకి భారీ వలసలు
పరవాడ,పెన్ పవర్
మండలం లోని పెదముషీడి వాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్ ఆధ్వర్యంలో టిడిపి మరియు బీజేపీ పార్టీ ల నుంచి భారీగా వైసీపీ లోకి చేరికలు.అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దముషిడి వాడనుంచి టిడిపి సర్పంచి అభ్యర్థి గా పరాజయం పొందిన బలిరెడ్డి అప్పారావు(కాంట్రాక్టర్) మరియు పరవాడ మాజీ జడ్పీటీసీ పెందుర్తి నియోజకవర్గ బీజేపీ లో కీలక సభ్యుడు బొద్దపు వెంకట రమణ, రమణమ్మ దంపతులు ఈ కార్యక్రమంలో వైస్సార్ తీర్ధం పుచ్చుకున్నారు.బొద్ధపు రమణ బీజేపీ లో పెందుర్తి నియజకవర్గం లో కీలక నేత గా ఉన్నపటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ కి రాజీనామా చేసి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన చూసి ఆకర్షితులమై వైసిపి పార్టీలో చేరుతున్నట్లు వీరు తెలియజేసారు.ఈ విషంలో అనుచరులు,అభిమానులు,కార్యకర్తల అభీష్టం మేరకే వై యెస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పార్టీలో చేరడం జరిగిందని వీరు తెలిపారు.ఈ సందర్భంగా మమ్ములును పార్టీ లో కి ఆహ్వానించిన పెద్దలుకు,కార్యకర్తలకు,అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు కి పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ కి అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాద్ కి,రాష్ట్ర సి.ఈ.సి సభ్యులు పయిల శ్రీనువాసురావు కి జెడ్పిటిసి అభ్యర్థి పిఎస్.రాజు కు మరియు ఇతర ముఖ్యనాయకులకు,వైసీపీ కార్యకర్తలకు పరవాడ మాజీ జడ్పీటీసీ బొద్దపు వెంకట రమణ ,రమణమ్మ దంపతులు,బలిరెడ్డి అప్పారావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment