Followers

స్మశాన భూముల ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి

 స్మశాన భూముల ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి

విజయనగరం,పెన్ పవర్

 విజయనగరం జిల్లా మెంటాడ మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉపాధి కూలీలు భారీ ధర్నా చేశారు. మండల కేంద్రం మెంటాడ స్మశాన భూమి పై ఆగూరు గ్రామస్తులు. పిట్టాడ గ్రామస్తులు సేద్యం చేస్తూ వస్తున్నారు. స్మశాన భూమి ఆక్రమణదారుల  ను తొలగించాలని మండల తాసిల్దార్ దగ్గర గ్రామస్తులు తెలియజేయగా ఆయన స్పందించి స్మశాన భూమి హద్దులను ఏర్పాటు చేసి స్తంభాలు కూడా పాతి oచారు. ఉపాధి పథకంలో స్మశాన వాటిక  కు రహదారి మంజూరు అయినది పనులు ప్రారంభిస్తే ఉండగా ఆక్రమణదారులు దౌర్జన్యానికి పాల్పడి సుమారుగా 500 మంది వేతన దారులను పనిచేయకుండా వెళ్లగొట్టడO జరిగింది. దీంతో ఉపాధి కూలీలు  మండల తాసిల్దార్ దగ్గర మొర  పెట్టుకోగా ఉపాధి కూలీలు గ్రామస్తులు తెలియజేయగా సమస్యను రెండు రోజులపాటు వాయిదా వేయాలని మండల తాసిల్దార్ రవి కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాయపల్లి రవిశంకర్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరు చనిపోయినా  దహనం చేయడానికి స్థలం లేకుండా ఆక్రమణకు గురైందని ఆక్రమణదారులు ఎవరైనా అప్పటికీ ఉపేక్షించేది లేదని వారిని వెంటనే తొలగించాలని కోరారు. ప్రస్తుత సర్పంచ్ రేగటి రాంబాబు మాట్లాడుతూ స్మశాన భూమి కబ్జా  జరిగింది గ్రామస్తులు ఇబ్బందులు గుర్తించి వారిని వెంటనే తొలగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో సిపిఎం పార్టీ నాయకులు రా కోటి రాములు. వైసిపి నాయకులు పాశిల  ప్రసాద్. సిరి శెట్టి నారాయణ రావు. రెడ్డి రాజగోపాల్. పలువురు ఉపాధి కూలీలు గ్రామస్తులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...