Followers

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో సింగరాయకొండ పంచాయితీ

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో సింగరాయకొండ పంచాయితీ            

పెన్ పవర్, కందుకూరు

   కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు సింగరాయకొండ సర్పంచ్ తాటిపర్తి వనజ, సీనియర్ వైఎస్ఆర్ సీపీ నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాలతో సింగరాయకొండ లో డా. శివరామిరెడ్డి  హాస్పిటల్ నుండి కందుకూరు రోడ్డు సెంటర్ వరకు కరోనా   ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయించారు.  .ప్రజలు మాస్కులు ధరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించాలని, లాక్ డౌన్ కి సహకరించాలని  తాటి పర్తి చంద్రశేఖర్  కోరారు. ఈ కరోన  వైరస్ విస్తరించకుండా    ముందస్తుగా తగిన నివారణ చర్యలు తీసుకుంటామని , వైరస్ విస్తరించకుండా ప్రజలు సహకరించాలని మాస్క్ లు, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని సింగరాయకొండ సర్పంచ్   తాటి పర్తి వనజ  విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శైలజ, షేక్ పటేల్, షేక్ సలీం భాష, సవలం కోటేశ్వరరావు, చొప్పర వెంకన్న, కుంచాల రవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...