Followers

చిన్నారిని ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు

 చిన్నారిని ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు


పెన్ పవర్ , గొల్లపల్లి

పెన్ పవర్ కథనానికి స్పందన సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న ఆపన్నహస్తాలు గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల మహేష్ అశ్విత దంపతుల నాలుగు నెలల కొడుకును ఆదుకునేందుకు ఆపన్న హస్తాలు ముందుకువస్తున్నాయి. బాబు గుండె శస్త్రచికిత్స బాధతో ప్రాణాప్రాయ స్థితిలో పూర్తి వైద్యానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల  ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేస్తారు వారి వద్ద అంత ఆర్థిక స్థోమత లేదని తెలుసుకున్న జగిత్యాల హిందు యువత సభ్యులు వంశీధర్ రావు, భీమలింగం,శేఖర్, రవీంధర్ వారి ఇంటి కి వెళ్ళి 5000 రూపాయలు గొల్లపల్లి మండల తెరాస యువ నాయకులు కిష్టంపెట రాంచందర్ రెడ్డి తన వంతు సహయంగా 5000 రూపాయలు కూన రాజేశ్ గారు 1000 రూపాయలు మొత్తన్ని 11000 రూపాయలను వారి కుటుంబనికి తెరాస యూత్   మండల అధ్యక్షుడు చెవుల రవీంధర్ ఆధ్వర్యంలో  కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజు మీన్ కూమార్, కొక్కు లక్ష్మణ్, చెవుల గణేష్, రాజు పాల్గొన్నారు.

నా బిడ్డను బ్రతికించండి . బాబు తల్లిదండ్రులు.

ప్రభుత్వం దయచూపి తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు 

మీరు వీలైనంత సహయం చేయండి

గూగుల్ పే ఫోన్ పే

 శ్రీరాముల శ్రీకాంత్ 8179260462

  బాబు బాబాయ్ ఫోన్ నెంబర్

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...