సోలార్ ప్లాంట్ ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్
పెన్ పవర్, మందమర్రి
మందమర్రి ఏరియాలోని పాల చెట్టు దగ్గర గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డైరెక్టర్ ఆపరేషన్, పా ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ మాట్లాడుతూ ఈరోజు 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్, మందమరి ఏరియాలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇందుకు సహకరించిన మందమారి ఏరియా జిఎం సోలార్ ఆర్ ఎన్ ఆర్ జి సోలార్ ఆధార్ గ్రూప్ వారికి అభినందనలు తెలియజేశారు సింగరేణిలో పౌర విద్యుత్ ప్లాంట్ స్థాపన ద్వారా సింగరేణి మరియు తెలంగాణ రాష్ట్రానికి ప్రగతిని సాధించి పెడుతుంది. వీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ కూడా ప్రారంభించబోతున్న మని అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించడానికి సింగరేణి ప్రయత్నం చేస్తుందని అన్నారు సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయకూడదని తెలియజేశారు. విద్యుత్తు అన్నిటికంటే మనకు సోలార్ విద్యుత్తు చౌకధరలతో తయారవుతుందని అందుబాటులో ఉంటుందని దీనిపై ఆధారపడిన రైల్వేస్ కోవచ్చు ఇతర పరిశ్రమలు లాభాల్లోకి వస్తుందని అన్నారు. అలాగే మనం లాభాలలో పని చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా మాస్కులు ధరించండి షేర్ చేసుకోండి చేతులను శుభ్రంగా కడుక్కోండి. సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు రక్షణతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ లాభాల బాటలో పయనించాలని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ అందజేసిన ఆధాని సోలార్ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ జి ఎం జగన్ మోహన్ రావు అధికార, సంఘం అధ్యక్షుడు డు జగ్గారెడ్డి ఆదాని, డిజిఎమ్ గోవర్ధన్ పి ఎం వరప్రసాద్ సింగరేణి హెచ్ ఓ డి అధికారులు యూనియన్ నాయకులు వర్క్ షాప్ సివిల్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment