అన్ని సౌకర్యాలతో వీడియో కాన్ఫరెన్స్ హాల్
చిత్తూరు, పెన్ పవర్
చిత్తూరు నగరపాలక సంస్థ వీడియో కాన్ఫరెన్స్ హాలును అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని నగర మేయర్ ఎస్.అముద చెప్పారు. గురువారం మధ్యాహ్నం నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రాంగణంలో అదనపు భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం మేయర్ నగరపాలక కార్యాలయం, మొదటి అంతస్తులో కార్యాలయ నిర్వహణ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ రమేష్, డీఈఈ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment