Followers

ఆర్యభట్ట పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి.

 ఆర్యభట్ట పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి.

టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వరరావు..

తొర్రూరు, పెన్ పవర్

నిబంధనలు ఉల్లంఘించి, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన ఆర్యభట్ట హైస్కూల్ ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని, టీడబ్ల్యూజేఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రములోని స్థానిక ఎల్ వై అర్ గార్డెన్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, కలెక్టర్ కు సమాచారం ఇచ్చి, న్యూస్ కవరేజ్ వెళ్లినందుకు సూర్య విలేకరి సిరికొండ విక్రమ్ కుమార్ ను వ్యక్తిగతంగా దూషించి, పాత లారీతో గుద్దించి చంపుతానని, ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధూకర్ రెడ్డి ఫోన్లో బెదిరించడం దారుణమని అన్నారు. దీనిపై పోలీసు అధికారులు త్వరితగతిన  మధూకర్ రెడ్డి పై కేసు నమోదు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జర్నలిస్టులకు ఆపదొస్తే ఎల్లవేళలా అండగా ఉంటామని, తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో జర్నలిస్టులు చంద శ్రీనివాస్, సిరికొండ విక్రమ్ కుమార్, బందు శ్రీధర్, కొమ్మనబోయిన యాకయ్య యాదవ్, దొంగరి శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, పస్తం సాంబ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...