Followers

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ సెకండ్ డోస్

  జిల్లా వ్యాప్తంగా  ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ సెకండ్ డోస్ 

చిత్తూరు,  పెన్ పవర్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం జరుగుతుందని   జిల్లా కలెక్టర్ హరినారాయణన్  తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 9,400 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. పాజిటివ్ బాధితుల చికిత్సకోసం తిరుపతి స్విమ్స్, రుయా, చిత్తూరు, మదనపల్లి ఆసుపత్రిలల్లో రెండువేల బెడ్లు  అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ శ్యాంపిల్ ఫలితాలను 24 గంటల్లో అందించేలా తిరుపతిలో నూతన ల్యాబ్  సామగ్రి వారం రోజుల్లో వస్తుందని తెలిపారు. ట్రయాజ్ సెంటర్ ల కోసం రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో  భవనాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ నివారణకు ప్రజలు సైతం సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంట్లో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యువత మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు. మస్కు దరించని వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ వీరబ్రహ్మం, డీ ఎం హెచ్ ఓ పెంచలయ్య, డీ సీ హెచ్ ఎస్ సరలమ్మ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...