Followers

కోవిడ్ పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలి

కోవిడ్ పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలి

విమ్స్ లో సమస్యలు పరిష్కారానికి చర్యలు
విశాఖపట్నం, పెన్ పవర్

కోవిడ్ పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.   శనివారం విమ్స్ ఆసుపత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, విమ్స్ సంచాలకులు, ఎఎంసి ప్రిన్సిపల్, రెవెన్యూ అధికారులుతో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న సేవలు గురించి సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమ్స్ లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఏ ఏ సిఫ్టుల్లో విధులు ఎలా నిర్వహిస్తున్నదీ వివరాలను విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు.  మొత్తం సిబ్బందిని 3 సిఫ్టుల్లో విధులు నిర్వహించేలా రోస్టర్ తయారు చేయాలని ఆదేశించారు.  ఆసుపత్రిలో ప్రతి వార్డులోను ఎల్లపుడు వైద్యులు, ఇతర సిబ్బంది పేషెంట్లకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డి.ఎ. నాయుడుని ఆదేశించారు.   ఆక్సిజన్ సరఫరా, ట్యాంక్ కెపాసిటీ ఎంత, ఎప్పటికప్పుడు పరిశీలించి దానిని రీఫిల్ చేయాలని స్పష్టం చేశారు.   రెవెన్యూ అధికారులు ఉప కలెక్టర్ ఎం.వి. సూర్య కళ, ఆయుష్ ఆర్.డి.డి. వై. శేఖర్, ఎస్ఎస్ఎ పిఒ మళ్లిఖార్జున రెడ్డి, గాజువాక తహసిల్థార్ లోకేశ్వరరావు, తదితరులను 3 సిఫ్టుల్లో విమ్స్ లో విధులు నిర్వహించాలని ఆదేశించారు.  విమ్స్ లో విధి నిర్వహణలో భాగంగా రెవెన్యూ అధికారులు వార్డులలోని సిసి కెమేరాల పుటేజిని ఎప్పటికప్పుడు పరిశీస్తూ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించాలన్నారు.  సిప్టులు వారీగా విమ్స్ లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు అవుతున్నది లేనిది పరిశీలించాలని చెప్పారు.  ఎవరైనా పేషెంట్లు వైద్య సేవలు నిమిత్తం విమ్స్ లోనికి అడుగు పెట్టినపుడు వారికి పడకలు లేవని ఎట్టి పరిస్థితిలోను వెనక్కి పంపరాదని ఆదేశించారు.  హెల్ప్ డెస్క్ నుండి పేషెంట్లు బందువులకు తగు సమాచారం అందించాలని తెలిపారు.  

అన్ని వార్డులలో పరిస్థితి, పేషెంట్లు, కాలీ పడకల వివరాలను ప్రతి రెండు గంటలకు అప్ డేట్ చేయాలన్నారు.    ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎ.ఎం.సి. ప్రిన్సిపల్, కోవిడ్ నోడల్ అధికారి డా. పి.వి. సుధాకర్, విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్, ఉప కలెక్టర్ ఎంవి సూర్యకళ, ఆయుష్ ఆర్.డి.డి. వై. శేఖర్, ఎస్ఎస్ఎ పిఒ మళ్లిఖార్జున రెడ్డి, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డి.ఎ. నాయుడు, గాజువాక తహసిల్థార్ లోకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఆయన ఆసుపత్రి పరిసరాలను వైద్యులు, అధికారులతో పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ పడకలు సిద్దం చేసినట్లు వెల్లడించారు.  విమ్స్ ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలపై కూలంకుషంగా చర్చించి పరిష్కరించి, విమ్స్ ను మరింత బలోపేతనానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  కెజిహెచ్ నుండి విమ్స్ కు 86 మంది వైద్యులను వేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో పిపిఇ కిట్లు,  ఆహారం, ఆక్సిజన్, తదితరమైన వాటిపై కూలంకుషంగా చర్చించినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు 24/7 గంటలు పనిచేయాలని చెప్పారు. కోవిడ్ పేషెంట్లు ఎవరైనా మరణిస్తే వారి బందువులకు సమాచారం తెలియజేయాలని, అనంతరం ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు.  ఆసుపత్రిలో ఉప కలెక్టర్ ఎం.వి. సూర్య కళ, ఆయుష్ ఆర్.డి.డి. వై. శేఖర్, ఎస్ఎస్ఎ పిఒ మళ్లిఖార్జున రెడ్డి, గాజువాక తహసిల్థార్ లోకేశ్వరరావు, తదితరులను నియమించినట్లు పేర్కొన్నారు.  సిఫ్టులు వారీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల నుండి కూడా కోవిడ్ పేషెంట్లు వస్తున్నట్లు వివరించారు.  ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్ పి.వి. సుధాకర్, విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్, తహసిల్థార్ లోకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...