Followers

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

అనకాపల్లి,పెన్ పవర్

నేడు అనకాపల్లి పట్టణంలో షిరిడి సాయి పర్తిసాయి థియేటర్లో కింగ్ అక్కినేని నాగార్జున గారు నటించిన వైల్డ్ డాగ్ చిత్రం అద్భుత విజయం సాధించిన సందర్భంగా  ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి  ఏ పాత్ర అయినా సరే న్యాయం చేయగల వ్యక్తి అక్కినేని నాగార్జున గారు అని ఇంత వయసులో కూడా ఒక (పోలీస్) నేషనల్ ఇన్విటేషన్ ఏజెంట్ అధికారిగా నాగార్జున గారి అద్భుతమైన పాత్రలో నటించి దేశపతి నేపథ్యంలో సాగిన చిత్రం ప్రజల దోచుకున్నారు అని తెలియజేశారు.

ఈ సందర్భంగా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు అందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో  అక్కినేని అభిమానులు సిహెచ్ అవతార్ (అవ్వ), గోల్డ్ వాసు, యల్లపు శ్రీనివాస్, జొన్నాడ సురేష్, నీలకంఠం, మనో శీను, ఎస్, భాను చందర్ అఖి, దీపు, చందు, బండి రాజా, రాంబిల్లి బాలాజీ, రాంబిల్లి మురళి, నీలగిరి శీను,  చంటి తేజ,ఆది, రవి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...