అనుమతి లేని లే అవుట్లు, నోటీసులు జారీ..
సంతబొమ్మాళి, పెన్ పవర్
మండలంలో నౌపడ పంచాయతీ పరిధిలోగల పంటపొలాలను కొందరు లేఅవుట్లుగా మార్చేస్తున్న నేపధ్యంలో పంచాయతీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సర్పంచ్ పిలక బృందాదేవి ప్రతినిధి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించి, ఆయా లేఅవుట్లలో పంచాయితీ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పంచాయతీల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ లు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఇప్పటికే ఏవైనా విక్రయాలు నిర్వహించినట్లయితే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు చేపట్టాలని, ఈ విషయాన్ని గతంలో కూడా ఆయా లేఅవుట్ యజమానులకు నోటీసు ద్వారా తెలిపామని పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ లే అవుట్ లో వేసిన ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి గృహనిర్మాణం చేసినట్లయిన పంచాయతీ పరిధిలోని తీసుకోదని ఈ విషయాన్ని వినియోగదారులు కూడా తేల్చుకుని తెలుసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో నౌపాడ పంచాయతీల పరిధిలో తురక వీధిలో సర్వే నెంబర్ 419/6, లో 2 ఎకరాల 50 సెంట్లు బి ఎమ్ ఆర్ వెంచర్ , 49/5లో 1 ఎకరా49 సెంట్ లో టెక్కలి వీధి వద్ద అమర్ సింగ్ వెంచర్,415/2 సర్వేనెంబర్ లో 82 సెంట్ లో వైయస్సార్ కాలనీ పక్కన బెలుసంటి నాగేశ్వరావ్ వెంచర్, 419/1లో 54 సెంటు లో మర్రి శ్రీను వెంచర్, 427/1ఇ,2ఏ,2సీ,2ఈ, లో 1 ఎకరా 8 సెంట్లు ల్లో, కొండపల్లి డెప్పి వద్ద సునీల్ అండ్ రాజేష్ వెంచర్, కూర్మ నాథ పురం వద్ద సర్వే నంబర్523,208,494/1లో1 ఎకరా 11 సెంట్లు లో డబ్బీరు కూర్మారావు అండ్ బ్రదర్స్ వెంచర్, నౌపడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద సర్వే నెంబర్358/2లో1 ఎకరా20 సెంట్లు లో చింతాడ జీవన్ వెంచర్, నౌపడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద సర్వే నెంబరు358/2లో1 ఎకరా 95 సెంట్లు లో వారణాసి గోవిందరాజులు వెంచర్లు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార వెంచర్లు వేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేయాలంటే ముందుగా పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇటువంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం లేఅవుట్లు లేకుండా ఎటువంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ సంబంధిత అధికారులు ఆదేశాల జారీ చేసింది. దీంతో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చెక్ పెట్టినట్లయింది. అంతేకాకుండా ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా అనుమతులు కావాల్సి ఉంటే పంచాయతీ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని పంచాయతీ సెక్రటరీ తెలిపారు. జిల్లా ఎస్ఎఆర్, అర్బన్ డెవలాప్మెంట్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు.
No comments:
Post a Comment