టిప్పర్ బీభత్సం.. కార్మికుడు దుర్మరణం...
పెన్ పవర్, మేడ్చల్
మేడ్చల్ పట్టణంలో శనివారం ఉదయం ఒక టిప్పర్ బీభత్సం సృష్టించింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పట్టణంలోని ఎస్ఆర్ వైన్స్ ముందు డివైడర్ ని ఢీ కొట్టి అవతలి వైపుకు దూసుకొచ్చింది. ఒక్కసారిగా టిప్పర్ దూసుకురావడంతో అక్కడున్నవారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు పూడూరు గ్రామానికి చెందిన దశరథ(48) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే వీధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టాపూర్ కు చెందిన డబిల్ పురం లక్ష్మీ(46) కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment