Followers

కేసీఆర్ ఆరోగ్యం కోసం యజ్ఞం...

 కేసీఆర్  ఆరోగ్యం కోసం యజ్ఞం..

కరోణ నుండి త్వరగా కోలుకోవాలి...
నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి...

తార్నాక,  పెన్ పవర్ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రథసారథి, అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోణ బారి నుండి త్వరగా కోలుకోని రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఆరోగ్యం కోసం యజ్ఞం చేసినట్లు నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ తార్నాక లోని లక్ష్మీ గణపతి ఆలయంలో కెసిఆర్ ఆరోగ్యం కోసం నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉక్కుమనిషిగా పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. టీ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధన కోసం సుమారుగా 20 సంవత్సరాలుగా కెసిఆర్ వెన్నంటే ఉండి పోరాటం చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కి కరోనా వైరస్ సోకిన విషయం తెలియగానే చాలా కలత చెంది ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కరోణ బారి నుండి త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర టిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...