కరోనా అధికంగా ఉందనేది జగమెరిగిన సత్యం..
ప్రజలు కరోనాతో ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, టెస్టులు సకాలంలో రాక, ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ కనీసం బాధ్యత లేకుండా గుంపులుగా వైసిపి కార్యకర్తలైన వాలంటీర్లకు సన్మాన సభలు పెడతారా, సమావేశానికి వచ్చిన వాలంటీర్లకు, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు వహిస్తారు. నిన్న ఎస్ కోట, ఈ రోజు సాలూరులో వాలంటీర్ల సన్మానాలు నిర్వహించటం భాధ్యతారాహిత్యం కాదా?? మహారాజ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చనిపోయారని ఒకరు. మరణాలే లేవని ఒకరు, ఇలా భిన్నవాదనలు వినిపించినా, కరోనా తీవ్రంగా ఉన్నా విద్యాశాఖ మంత్రి టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం దారుణం.. పరీక్షలు నిర్వహిస్తే సుమారు 40 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుంది. కరోనా వల్ల అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసారు...కొవిద్ ఉద్ధృతి కారణంగా కేబినెట్ భేటీ వాయిదా వేశారు. మరి టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరు. MLC, MLA, మంత్రులవేనా ప్రాణాలు విద్యార్థులవి కాదా, 30 మంది మంత్రులతో దూరంగా కూర్చునే కేబినెట్ వాయిదా వేశారు. 200 మంది కూర్చునే అసంబ్లీ వాయిదా వేసారు.మరి టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరు??? లక్షల మంది విద్యార్థులు, రోడ్లమీదికొస్తే కరోనా సోకదా, వారివి ప్రాణాలుకావా, మొండిగా పరీక్షలు పెట్టేందుకు ముందుకు వెళ్లడం విచారకరం. పరీక్షల క్రమంలో ఎవరైనా కరోనాతో మరణిస్తే మీరే బాధ్యత వహిస్తారా??? ఎలా? మరి ఇంతమంది చనిపోతుంటే ఏ భాద్యత తీసుకున్నారు?? ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వం ఏ భాద్యత తీసుకుంది. ఇప్పుడు విద్యార్థుల పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పంతం ఎందుకు, ఇది మంచిదికాదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బందిని కరోనా బారినపడకుండా ప్రభుత్వం కాపాడగలదాకోవిద్ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం పరీక్షలు పెడతామనడం దారుణం. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దుచేసి, జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మొండితనానికి పోయి అర్ధంలేని నిర్ణయాలు తీసుకుంటే అనర్ధాలు తప్పవు.
No comments:
Post a Comment