Followers

మిషన్ భగీరథ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం

 మిషన్ భగీరథ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం..!

 తొర్రూరు ఆర్ డి ఓ డి కొమరయ్య 

పెన్ పవర్, మరిపెడ 

మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో మిషిని భగీరథ పథకానికి భూమి ఇచ్చిన భూ నిర్వాసితులకు అవార్డు మంజూరు అయినట్లు తొర్రూర్ ఆర్డిఓ డి కొమరయ్య తెలిపారు. గురువారం మరిపెడ తహసిల్దార్ కార్యాలయంలో భూమి కోల్పోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి  పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కృషితో అవార్డు ప్రకటన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ గ్రామంలో లో13 ఎకరాల 10 గంటల భూమి 23 మంది రైతుల నుండి భూసేకరణ చేసినట్లు ఆయన తెలిపారు. వారికి 2013 చట్ట ప్రకారంగా ఎకరానికి 8 లక్షల 96 వేలు రూపాయల నష్టపరిహారం నిమిత్తం అవార్డు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  మరిపెడ తాసిల్దార్ జి రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ నంద నాయక్, ఆర్ ఐ నజీముద్దీన్, అబ్బాయి పాలెం గ్రామం సర్పంచ్ జినక మణి ఇద్దయ్య ,రైతులు డాక్టర్ రమేష్, జిన్నా బి క్షం, జినక వేంకన్న, మరో 20 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...