ఎల్లారెడ్డిపేట మండలంలో విచ్చలవిడిగా పగలు రాత్రి ఆక్రమంగా ఇసుక రావాణా
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఇసుక మాఫియా
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని అధికారులు...
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుండి ఇసుక మాఫీయా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అదికారుల కనుసన్నల్లో పగలు-రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి ఇసుక అవసరమున్న వారు ఓక ట్రాక్టర్ ట్రిప్పుకు 300 రూపాయల చొప్పున చాలన్ కట్టి ప్రభుత్వ ఆదాయానికి జమ చేయవలసి ఉంటుంది. ఇసుక మాఫియా అలా కట్టకుండ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అదికారులకు లిఖితపూర్వకంగా .వాట్సాప్ ల ద్వారా సాక్షాధారాలతో పలువురు పిర్యాదులు చేసినా ఏనాడూ పట్టించుకున్న పాపనా పోలేదు. " ఎక్కడి దొంగలు అక్కడనే గఫ్ చుఫ్ " అన్న చందంగా మండల స్థాయి అదికారుల నుంచి జిల్లా స్థాయి అదికారుల తీరు ఉందని పలువురు విమర్షిస్తున్నామన్నారు . ఇసుక మాఫియా, అదికారులు కలిసి దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పిర్యాదులు చేస్తే ఆక్రమంగా ఇసుక ను తరలిస్తున్న ఇసుక మాఫియా ను అరికట్టవలసిన అదికారులు అరికట్టలేక పోతున్నారు. అంతేకాదు పిర్యాదు దారుల పేర్లను ఎంతో గోప్యంగా ఉంచవలసిన అదికారులు పిర్యాదు దారుల పేర్లను భయట పెట్టి ఇసుక మాఫియా ఎదుట భధనామ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా ట్రాక్టర్ ట్రాలీలో ఇసుక ను నింపి భయటకు ఇసుక కనభడకుండా గడ్డిని కప్పి ఆక్రమంగా ఇసుక ను రావాణా చేస్తున్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా ట్రాక్టర్ ఇంజన్ బాడీల కు ట్రాలీ బాడీలకు నెంబర్ ప్లేట్స్ వాడడం లేదు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి ఎల్లారెడ్డిపేట. గంబీరావుపేట మండలాలో ఇసుక ను డంపింగ్ చేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మీదుగా కామారెడ్డి .నిజామాబాద్. హైదరాబాద్ కు ఇసుక ను ఆక్రమంగా తరలించి లక్షలాధి రూపాయలను దండుకుంటున్నారు. స్థానికంగా ఇళ్ళు కట్టుకునే వారు ఏవరైనా ఇసుక కావాలనీ అధికారుల దగ్గరకు వెళితే సవలక్ష కారణాలు వెతుకుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికేనా మీకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించి వేతనాలు పెంచింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీ. వెంకటాపూర్ ఇసుక రీచ్ పై సమగ్రవిచారణ జరిపి ఇసుక మాఫియా ను అరికట్టి ఆక్రమాలకు పాల్పడుతున్నా రెవెన్యూ. పోలీస్ అదికారులను .సిబ్బంది నీ గుర్తించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment