పింఛను ఇప్పించండి సారూ...
కన్నెపల్లి , పెన్ పవర్మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని తాళ్ల రెబ్బన కు చెందిన వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్ కు నోచుకోని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ కిందిస్థాయి అధికారుల వల్ల నీరుగారి పోతుందని వృద్ధులు వికలాంగులు వాపోయారు. దీనికి నిదర్శనమే ఈ మూగ వికలాంగులు కుమ్మరి సాయమ్మ మూగ వికలాంగురాలు కి కొద్దికాలంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ వచ్చిందని ఇప్పుడు రావట్లేదు అని ఆమె బంధువులు వివరించారు. దుర్గం జంపన్న మూగ వికలాంగుడికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెన్షన్ వచ్చిందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ రావట్లేదని వికలాంగుడి తల్లి వాపోయింది .దయచేసి అధికారులు, నాయకులు పట్టించుకొని పెన్షన్ ఇప్పించగలరని వారు కోరారు.
No comments:
Post a Comment