కూనవరం గ్రామ సమీపంలో జోరుగా సాగుతున్న కోడిపందాలు
సీతానగరం, పెన్ పవర్
కూనవరం గ్రామం సమీప పంటపొలాల్లో బహిరంగంగా కోడి పందాల రాయుళ్లు విచ్చలవిడిగా కోడి పందాలు సాగిస్తున్నారు. ఒక ప్రక్క కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నా కనీసం భయం లేకుండా గుంపుగా గుమిగూడి మాస్క్ లు లేకుండా ఈ కోడి పందాలు కొనసాగించడంపై గ్రామ మహిళలు ఆవేదన చెందుతున్నారు. కూనవరం ప్రభుత్వ గ్రామ కమిటీ నాయకులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం పై నిరుపేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. మండల అధికారులు స్పందించి పేకాట,విచ్చలవిడిగా సాగుతున్న సారా అమ్మకాలు,కోడిపందాలు వంటివి అరికట్టాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ప్రభుత్వ నాయకులు ఇటువంటి జూదాలను అరికట్టడం మానేసి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ము కాయడం సరికాదని గ్రామ ప్రజలు అంటున్నారు.
No comments:
Post a Comment