డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ పన్నాల
తార్నాక, పెన్ పవర్మల్లాపూర్ డివిజన్ల లోని అశోక్ నగర్ లో సమస్యలు తీర్చాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిని కలసి స్థానిక కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. డ్రైనేజ్ సమస్య , స్మశాన వాటిక మరియు కమ్యూనిటీ హాల్ పనుల పూర్తి చేయాలనీ అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వార్డు కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా పన్నాల, వారికి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో పనులు ప్రారంభించి , సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డివిజన్ లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అల్లూరి నరేందర్ రెడ్డి , బుసాని రఘు , కోమర్తి సైదులు , అంజయ్య , కుమ్మరి రాములు , సురేష్ , శేఖర్ , రాము , ప్రవీణ్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment