గుంతల మయంగా మారిన ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది
పట్టించుకోని అధికార యంత్రాంగం
కేసముద్రం, పెన్ పవర్
కేసముద్రం మండల కేంద్రంలోని గల ఫ్లైఓవర్ గుంతలమయంగా మారి అనేక ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి సిసి రోడ్డు గుంతలు గా పడి వేగంగా వస్తున్న వాహనాలకు దగ్గరికి వచ్చే వరకు కన పడకపోవడంతో అదుపుతప్పి వాహనాలు వాహనాలు ఢీకొన్న సంఘటనలుఉన్నాయి ,ద్విచక్ర వాహనదారులు కిందపడిపోయి గాయాలపాలై పోవడమే కాకుండా మృతి చెందిన సంఘటన కూడా లేకపోలేదు ,విచిత్రమేమంటే ఈ ఫ్లై ఓవర్ పై నుండి మంత్రులు ఎమ్మెల్యే మండల అధికారులు అందరూ ఫ్లైఓవర్ పై నుండి గుంతలు గా మారిన ఈ రోడ్డు పై నుండి నుండి వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ దీన్ని ఏ నాయకుడు ఏ అధికారి పట్టించుక లేకపోవడం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ,ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు గుంతల మయంగా మారిన ఫ్లైఓవర్ రోడ్డును సరి చేయవలెనని ప్రమాదాల బారి నుండి ప్రయాణికులను ప్రజలను కాపాడాలని పెన్ పవర్ ద్వారా ప్రజలు విన్నవించుకున్నారు
No comments:
Post a Comment