బాక్సైట్ కాల్సైట్ తవ్వకాలపై నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
నేతలు స్పష్టత ఇవ్వకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
విశాఖ- ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ
పెన్ పవర్, విశాఖపట్నం
ఎమ్మెల్యే ఎంపీలకు కిడారి సోమ లకు పట్టిన గతే పడుతుంది
బాక్సైట్ కాల్సైట్ తవ్వకాలపై ప్రజా నాయకులు తమ స్పష్టమైన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ మావోయిస్ట్ విశాఖ- ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరున ఒక లేఖ విడుదల అయ్యింది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాయకులు ఆదివాసీ హక్కులు హరించుకు పోతుంటే పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివాసి నాయకులని చెప్పుకుంటున్న వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటిల వైఖరిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. న్యాయమైన హక్కులకోసం ఆదివాసీలు పోరాటం చేస్తుంటే నాయకులు పట్టించుకోవడం లేదు. ఆదివాసీల పోరాటాన్ని అణిచి వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ క్యాంపులు కూంబింగ్లు ఆదివాసీల పై దాడులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వాటిని నిలిపివేయాలి. నాయకుల్లారా మీరు ఎవరికి సహకారం అందిస్తున్నారు ప్రజా పీడకుల కు దోపిడి వర్గాలకు కాపు కాస్తు ఆదివాసి గిరిజనులకు అన్యాయం చేస్తే కిడారి సర్వేశ్వరరావు సివేరి సోమ లకు పట్టిన గతే మీకు పడుతుందని లేఖలో హెచ్చరించారు. మన్యంలో ధైర్యంగా ఆదివాసీలు వీరోచితంగా పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం అధికారం కోసం ఎన్నికల ముందు 97 జీవని రద్దు చేసిన జగన్ బూటకపు సంస్కరణలతో ఆదివాసిల ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
మాకవరపాలెం అన్ రాక్ కర్మాగారానికి ఖనిజ సంపద దారాదత్తం చేసేందుకు 89 జీవోను తెచ్చారని తెలిపారు. అనంతగిరి మండలం నిమ్మలపాడు లో కాల్సైట్ తవ్వకాలకు టెండర్లు పిలవడం అన్యాయమని పేర్కొన్నారు. రైతు భరోసా అమ్మ వడి వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు దూరం చేస్తున్నారు. నిత్యవసర ధరలను అధికంగా పెంచేసి ప్రజలకు తిండికి కరువు చేస్తున్నారన్నారు. పోలీస్ క్యాంపు లో కూంబింగ్ లు గిరిజనుల పై దాడి అక్రమ కేసులు మానుకోవాలన్నారు. అడవుల నరికివేత పేరుతో అటవీశాఖ దాడులు ఆపి వేయాలన్నారు. గిరిజనులు వీరోచితంగా పోరాడి 1/ 70 చట్టం పెసా చట్టం లను దక్కించుకున్నారని ఆదివాసీల విజయం అన్నారు. ఆదివాసీ హక్కులను అణిచి వేసే ధోరణిలో దౌర్జన్య కాండ సాగుతుందన్నారు. గాలికొండ ఏరియాలో మార్చి 9న పెదవలస కు చెందిన తొమ్మిది మంది గిరిజనులను నిర్బంధించారు. లక్ష్మణ్ బాబు రావులను బలపం చెన్నయ్య కుర్ర నాగేశ్వరరావు తీసుకువెళ్లాలని ఎంత వరకు విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ప్రజల ఓట్లు చే లోకి వచ్చిన నాయకులకు బుల్లెట్ ప్రూఫ్ ల వాహనాలు కొనుగోలు చేయడం విడ్డూరం. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికైన ఆదివాసీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రజల పట్ల మీ వైఖరి ఏమిటో తెలియచేయాలని కోరారు. ఏజెన్సీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి పాల్గుణ ఎంపీ మాధవిలు మీరు ఏ ప్రజలకు ప్రతినిధులు అనుకుంటున్నారు. ప్రజా పీడితుల కు సెక్స్ వీడియోస్ దోపిడీ వ్యవస్థకా అన్న విషయం స్పష్టంగా బహిర్గతం చేయాలన్నారు. అధికార దాహంతో ఆదివాసీల హక్కులను ఖనిజ సంపాదను దోచుకోవాలని ప్రయత్నిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధేయులుగా ఉన్నట్లయితే మీకు ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెప్పక తప్పదు. కిడారి సర్వేశ్వరావు సివేరి సోమలకు విధించిన శిక్ష మీకు తప్పదని సిపిఐ మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ తన లేఖలో హెచ్చరిక జారీ చేశారు. రెండు వేరు వేరు అంశాలపై అధికార ప్రతినిధి కైలాసం అరుణలు లేఖలు విడుదల చేయడంతో ఏ ఓ బి ప్రాంతం ఉద్రిక్తతలతో ఉంది.
No comments:
Post a Comment